మెగాస్టార్ కు ఆ సినిమా అర్ధం కాలేదట!

మెగాస్టార్ కు ఆ సినిమా అర్ధం కాలేదట!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తనకు ఓ సినిమా అర్ధం కాలేదని సోషల్ మీడియా ముఖంగా వెల్లడించారు. దీంతో నెటిజన్లు కొందరు ఆయనకు సినిమా ఎలా చూడాలో సలహాలు ఇస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్'. నిజానికి హాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలో కూడా ఈ సినిమా వసూళ్ళ వర్షం కురిపించింది. అలాంటి సినిమా తనకు అర్ధం కాలేదని ఓపెన్ గా చెప్పారు బిగ్ బీ. అభిమానులతో సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉండే అమితాబ్ తాజాగా ఒక ట్వీట్ చేశారు. 

''తప్పుగా అనుకోకండి.. అవెంజర్స్ సినిమా చూశాను.. అసలేం అర్ధం కాలేదు'' అని అన్నారు. దీంతో నెటిజన్లు ఈ ట్వీట్ చూసి షాక్ అయ్యారు. అమితాబ్ కు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అవెంజర్స్ సిరీస్ లో వచ్చిన సినిమాలన్నీ చూడమని కొందరు కామెంట్ చేస్తే.. మరికొందరు ఏకంగా మీకంటే మీ మనవరాలు ఆరాధ్య ఈ విషయంలో బెటర్ అంటూ రిప్లై ఇచ్చారు. ఏప్రిల్ 27న విడుదలైన అవెంజర్స్ ఇప్పటికీ కొన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.