ఇప్పుడు సిస్టర్ వంతు అంటోన్న అమీ..!!

ఇప్పుడు సిస్టర్ వంతు అంటోన్న అమీ..!!

సినిమా పరిథి విస్తరించాక, వివిధ దేశాల నుంచి హీరోయిన్లు ఇండియాకు వస్తున్నారు.  ముఖ్యంగా సౌత్ కు.  సౌత్ లో హీరోయిన్ గా పాపులర్ అయితే చాలు.. బాలీవుడ్ లో, హాలీవుడ్ లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయి.  లండన్ లో టాప్ మోడల్ గా వెలిగిన అమీ జాక్సన్ సౌత్ లో మదరాసి పట్టణం, ఎవడు సినిమాలు చేసింది.  ఈ రెండు మంచి విజయాలు సాధించాయి.  ఆ తరువాత శంకర్ తో ఐ చేసిన పెద్దగా కలిసిరాలేదు.  ఆ వెంటనే శంకర్ .. రజినీకాంత్ కాంబినేషన్లో వచ్చిన రోబో 2పాయింట్ 0 లో నటించి మెప్పించింది.  హ్యూమనాయిడ్ గా అద్భుతంగా చేసింది.  

ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అమీ.  హాలీవుడ్ లోని పలు నిర్మాణ సంస్థలు సూపర్ గాళ్ గా ఆమెతో సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  అటు అమీ జాక్సన్ ప్రేమించిన లండన్ వ్యాపార వేత్త జార్జి తో వివాహానికి సిద్ధం అవుతున్నది.  రీసెంట్ గా అమీ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.  హ్యాపీ బర్త్ డే ఇన్ హరా.  ఈ ఏడాది ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్తూ ట్యాగ్ చేసింది.  దీనిని బట్టి ఈ ఏడాది చెల్లిని సినిమా ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టు అర్ధం అవుతుంది.