అడ్రస్ చెప్తే అవార్డ్ ఇస్తా...

అడ్రస్ చెప్తే అవార్డ్ ఇస్తా...

ఎప్పుడూ అనేక అంశాలపై సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహీంద్ర గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్‌ మహీంద్ర మరోసారి వార్తల్లో నిలిచారు. సృజనాత్మకతను ప్రోత్సహించే ఈ బిజినెస్‌ బిగ్ షాట్.. తన ట్విటర్‌లో ‘వన్ మ్యాన్ బ్యాండ్’ అనే వీడియో క్లిప్ పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి గిటార్, డ్రమ్స్ వాయిస్తూ పాటలు పాడుతున్నాడు. ఒక వ్యక్తి ఇలా మూడు పనులు ఒకేసారి చేయడం ఆనంద్ మహీంద్రను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ క్లిప్ పంపిన మిత్రుడిని అడిగితే ఈశాన్య రాష్ట్రాలకు చెందినవాడై ఉండొచ్చని చెప్పారు. ఎవరికైనా ఈ అద్భుత సంగీతకారుడి వివరాలు తెలిస్తే తనకు చెప్పాల్సిందిగా మహీంద్ర కోరారు. అతనిని అద్భుత ప్రతిభకు గుర్తింపుగా ఏదైనా అవార్డు ఇవ్వాలనుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.