ఇంగ్లండ్ పర్యటన కోహ్లీకి సవాలే...

ఇంగ్లండ్ పర్యటన కోహ్లీకి సవాలే...

ఇంగ్లండ్ పర్యటన టీమిండియా కెప్టెన్ కోహ్లీకి సవాల్ లాంటిదని ఆస్ట్రేలియా ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ మెక్‌గ్రాత్‌ అన్నారు. తాజాగా మెక్‌గ్రాత్‌ మాట్లాడుతూ... ప్రస్తుత క్రికెట్ లో విరాట్ కోహ్లీ నాణ్యమైన గొప్ప బ్యాట్స్ మెన్.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇంగ్లండ్ లోని పరిస్థితులు అనుకూలంగా ఉండవని మెక్‌గ్రాత్‌ అన్నారు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జిమ్మీ అండర్సన్ ను ఎదుర్కోవడం కోహ్లీకి కష్టమే.. ఈ పర్యటనలో జిమ్మీ బౌలింగ్ ను ఎదుర్కోవడం కోహ్లీకి సవాల్ అని అన్నారు. విరాట్ కోహ్లీపైనే భారత్ జట్టు ఆధారపడితే ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ పర్యటనలో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ పుజారా రాణిస్తాడనే నమ్మకముందని పేర్కొన్నాడు. భారత జట్టు బౌలింగ్ లో పటిష్టంగా ఉందని.. బౌలర్లు బుమ్రా, భువనేశ్వర్ లు రాణిస్తారని తెలిపారు. ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు సమష్టిగా రాణిస్తేనే విజయాలు వస్తాయని మెక్‌గ్రాత్‌ సూచించారు. జూన్ లో మొదలయ్యే ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుతో టీ-20, వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఇక ఐపీఎల్‌లో గాయం కారణంగా ఇంగ్లాండ్ వెళ్లి కౌంటీ క్రికెట్‌ ఆడాలనుకున్న విరాట్ కోహ్లీకి నిరాశే మిగిలింది.