ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తాం

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తాం

రాబోయే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం స్పష్టం చేశారు. రెండు రోజుల యుఏఈ పర్యటనలో ఉన్న రాహుల్ అక్కడి భారతీయ కార్మికులను కలిసి మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేసే మొట్టమొదటి పని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడమేనని చెప్పారు. గత ఏడాది మార్చిలో హోదా కోసం ఏపీ నాయకులు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినా ప్రభుత్వం స్పందించ లేదన్నారు. నవ్యాంధ్రకు కచ్చితంగా ఇవ్వాల్సిన ముఖ్య హామీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరిచిపోయారని విమర్శించారు. ఏపీకి ఇవ్వాల్సిన ఆర్థిక సాయం గురించి అంతా కలిసి కేంద్ర ప్రభుత్వానికి, మోడీకి అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు.