చివరి ఏడుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్

చివరి ఏడుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్

మధ్యప్రదేశ్ టీమ్‌లోని చివరి ఏడుగురు బ్యాట్స్‌మెన్ డకౌటయ్యారు. ఫలితంగా 35 పరుగులకే ఆలౌట్ అయి భారీ పరాజయాన్ని చవిచూసింది. ఆంధ్రా, మధ్యప్రదేశ్ జట్ల మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్‌ జరిగింది. 343 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 35 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. అనంతరం ఒక్క పరుగు కూడా జోడించకుండానే ఏడు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. 23 బంతులలో ఒక్క పరుగు కూడా చేయకుండా 6 వికెట్లు కోల్పోయింది. మరో బ్యాట్స్‌మన్ గాయం కారణంగా మైదానంలోకి రాలేదు. దీంతో ఆంధ్రా జట్టు 307 పరుగులతో ఘన విజయం సాధించింది. మధ్యప్రదేశ్ బ్యాట్స్‌మెన్ ఆర్యమన్ బిర్లా(12), యశ్ దూబె  (16) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఆంధ్రా బౌలర్లలో శశికాంత్ 18/6, విజయ్‌కుమార్ 17 /3 రాణించారు. ఆంధ్రా జట్టు రెండు ఇన్నింగ్స్‌లలో 132, 301 పరుగులు చేసింది. ఇక మధ్యప్రదేశ్ 91, 35 పరుగులు చేసి ఓటమిని చవిచూసింది.