ఏపీ ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల

ఏపీ ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల

ఏపీ ఎంసెట్‌-2019 పరీక్షలు ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఈమేరకు పూర్తి షెడ్యూల్‌ను ఇవాళ విడుదల చేశారు. 

  • ఈనెల 20న నోటిఫికేషన్‌ విడుదల
  • 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేందుకు మార్చి 27వరకు గడువు
  • రూ.500 అపరాధ రుసుముతో కలిపి ఏప్రిల్‌ 4 వరకు, రూ.1000 అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 9, రూ.5వేల అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 14, రూ.10వేల అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 19 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం 
  • ఏప్రిల్‌ 16 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌కి అవకాశం
  • ఏప్రిల్‌ 20 నుంచి 23 వరకు ఇంజినీరింగ్‌ విభాగానికి పరీక్షలు 
  • 23, 24 తేదీల్లో అగ్రికల్చర్‌ విభాగాలకు పరీక్షలు 
  • ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఒక బ్యాచ్‌కు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గంటల వరకు మరో బ్యాచ్‌కు పరీక్షలు 
  • మే 5న ఎంసెట్‌ పరీక్ష ఫలితాలు వెల్లడించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.