అనిల్.. మాధురి చెలరేగిపోయారు..!!

అనిల్.. మాధురి చెలరేగిపోయారు..!!

బాలీవుడ్ ను కితకితలు పెట్టేందుకు మరో సినిమా రాబోతున్నది.  అదే టోటల్ ఢమాల్.  హేరా ఫెరి, హౌస్ ఫుల్ సినిమాలు పూర్తి ఎంటర్టైన్మెంట్ తో వచ్చి హిట్ కొట్టాయి.  ఎంటర్టైన్మెంట్ తో వచ్చే సినిమాలకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్నది.  ఎంత ఫన్ ఉంటె అంత పెద్ద హిట్ సాధిస్తుంది.  అందుకే ఫన్ ఉండే కథలను కథనాలను ఎంచుకొని సినిమాగా తీసేందుకు బాలీవుడ్ దర్శకులు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు.  

అజయ్ దేవగణ్, అనిల్ కపూర్, అర్షద్ వర్షి, మాధురి దీక్షిత్, రితేష్ దేశముఖ్ వంటి చాలామంది స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు.  అవుట్ అండ్ అవుట్ ఫన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 22 న రిలీజ్ కాబోతున్నది.  ఫాక్స్ స్టార్ ఇండియాతో కలిసి అజయ్ దేవగణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఇంద్ర కుమార్ ఈ సినిమాకు దర్శకుడు.  ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ లో స్టేజిపై అద్భుతంగా డ్యాన్స్ చేశారు.  ఈ డ్యాన్స్ కు యూనిట్ ఫిదా అయింది.