మహేష్ సినిమాలో మరో అమ్మాయి !

మహేష్ సినిమాలో మరో అమ్మాయి !

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిస్ చేస్తున్న 'మహర్షి' చిత్రంలో కథానాయిక పూజా హెగ్డే అనే సంగతి తెలిసిందే.  ఇందులో ఈమె మాత్రమే కాకుండా మరొక హీరోయిన్ కూడ నటిస్తోంది.  ఆమె మీనాక్షి దీక్షిత్.  హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఈమె 'మహర్షి' సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది.  ఇప్పటికే అమెరికాలో తన పాత్ర తాలూకు షూటింగ్ కూడ పూర్తి చేసిందామె.  దిల్ రాజు, అశ్విని దత్, పివిపి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.