బాలకృష్ణతో ఆరేసుకోబోయి పాటేసుకుంటున్న తమన్నా

బాలకృష్ణతో ఆరేసుకోబోయి పాటేసుకుంటున్న తమన్నా

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త న్యూస్ బయటకు వస్తున్నది.  నిన్న రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీదేవి పాత్రలో రకుల్ ఎలా ఉండబోతున్నదో.. ఎన్టీఆర్ గెటప్ లో ఉన్న బాలకృష్ణతో ఎలా ఆడిపాడిందో నిన్న ఫోటో రూపంలో రిలీజ్ చేశారు. బాలకృష్ణ.. రకుల్ తో ఆకు చాటు పిందె తడిసె అంటూ స్టెప్పులు వేశారు.  

కాగా, ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ బయటకు వచ్చింది. ముల్కిబ్యూటీ తమన్నా ఈ సినిమాలో ఓ ప్రముఖ హీరోయిన్ పాత్రలో కనిపించబోతున్నదట.  ఎన్టీఆర్.. జయప్రద కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి.  అడవి రాముడు, చాణక్య చంద్రగుప్త, యమగోల వంటి ఎన్నో సినిమాలు వచ్చాయి.  అన్ని హిట్ గా నిలిచిన సినిమాలే.  మొదట్లో జయప్రద, జయసుధలు ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తారని అనుకున్నా.. క్రిష్ వారి పాత్రల కోసం యంగ్ హీరోయిన్స్ ను ఎంపిక చేస్తున్నారట.  జయప్రద పాత్రకోసం తమన్నను యూనిట్ అప్రోచ్ అయినట్టుగా సమాచారం.