అను ఇమ్మాన్యుయేల్ కోరిక ఈసారైనా తీరుతుందో లేదో ?

అను ఇమ్మాన్యుయేల్ కోరిక ఈసారైనా తీరుతుందో లేదో ?

 స్టార్ హీరోయిన్ అనే పేరుంది, స్టార్ హీరోల తో కలిసి నటించింది.. కానీ స్టార్ ఫలితం మాత్రం దక్కడంలేదు.  ఇది ప్రస్తుతం అను ఇమ్మాన్యుయేల్ పరిస్థితి.  మొదటి సినిమా 'మజ్ను'తో ఇంప్రెస్ చేసిన ఈ కలువ కళ్ళ సుందరి ఆ తరవాత స్టార్ హీరోయిన్ జాబితాలోకి త్వరగానే చేరుకుంది. 

పవన్ కళ్యాణ్ సరసన 'అజ్ఞాతవాసి', అల్లు అర్జున్ తో 'నా పేరు సూర్య' లాంటి బడా సినిమాలు చేసింది.  కానీ వీటిలో ఏ ఒక్కటీ కూడ ఆమెకు సాలిడ్ రిజల్ట్ ఇవ్వలేకపోయాయి.  దీంతో అను పరిస్థితి నవ్వలేక, ఏడవలేక అన్నట్టు తయారైంది.  ప్రస్తుతం ఆమె ఆశలన్నీ అక్కినేని నాగచైతన్యతో కలిసి చేసిన  'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం మీదనే ఉన్నాయి.  ఈ సినిమా విజయం సాధిస్తే ఆమెకు కెరీర్లో మొదటి హిట్ దొరికినట్లవుతుంది.  మరి టీజర్, ట్రైలర్లతో మెప్పించిన ఈ సినిమా అను కోరికను తీరుస్తుందో లేదో చూడాలి.