పరాజయాలకు ఫులుస్టాప్ !

పరాజయాలకు ఫులుస్టాప్ !

 

2017లో వచ్చిన 'శతమానంభవతి' తర్వాత అనుపమ పరమేశ్వరన్ కు ఆ స్థాయి హిట్ దక్కలేదు.  ఆమె చేసిన 'ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు, కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమ కోసమే' చిత్రాలు వరుసగా పరాజయం పొందాయి.  దీంతో ఆమె కన్నడలో అదృష్టాన్ని పరీక్షించుకుంది.  అక్కడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హీరోగా రూపొందిన 'నటసార్వభౌమ'లో కథానాయకిగా నటించింది అనుపమ.  కొన్ని రోజుల క్రితమే విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.  దీంతో అనుమప వర్యుస ఫ్లాపులకు ఫులుస్టాప్ పడింది.