నువ్వలా చూడకే...!!

నువ్వలా చూడకే...!!

మలయాళం ప్రేమమ్ సినిమాలో మాయచేసిన అనుపమ.. టాలీవుడ్ లోకి అదే పేరుతో రిమేక్ చేసిన సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.. ఈ సినిమా టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  ప్రేమమ్ హిట్ కావడంతో మంచి అవకాశాలు వచ్చాయి.  నితిన్ తో చేసిన అ.. ఆ మినహా మరే సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.  సక్సెస్ అవుతాయని అనుకున్నవన్నీ బోల్తా కొట్టడంతో ఢీలా పడింది.  

టాలెంట్ ఉన్న అమ్మాయికి అవకాశాలకు కొదవేంటి చెప్పండి.  అందుకే ఒక్క టాలీవుడ్ నో లేదంటే మలయాళం ఇండస్ట్రీనో నమ్ముకోలేదు.  సౌత్ లో ఉన్న అన్ని ఇండస్ట్రీలపై కన్నేసింది ఈ మలయాళం బ్యూటీ.  కన్నడంలో ఏకంగా పునీత్ రాజ్ కుమార్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది.  పునీత్ తో చేసిన నటనా సార్వభౌమ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.  ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో అనుపమ ఖుషీ అవుతున్నది.  ఈ సినిమాలోని ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఫోటో బాగుంది కదూ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  తెలుగులో మంచి సక్సెస్ అందుకోలేకపోయిన అనుపమ.. కన్నడలో డెబ్యూ మూవీతో హిట్ కొట్టడం విశేషం.