అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..!

అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..!
అనుష్క నటించిన చివరి రెండు చిత్రాలు భారీ బడ్జెట్ తో రూపొందినవే.  ఈ రెండు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.  బాహుబలి సీరీస్ తరువాత అనుష్క భాగమతి సినిమా చేసింది.  భాగమతి కూడా సూపర్ హిట్ కావడంతో.. అనుష్క నెక్స్ట్ ఏ సినిమా చేస్తుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. 
 
అయితే, తాజా సమాచారం అనుష్క నెక్స్ట్ చేయబోయే సినిమా ఏమిటి అనే దానిపై క్లారిటీ వచ్చింది.  నా నువ్వే సినిమాకు దర్శకత్వం వహించిన జయేంద్ర దర్శకత్వంలో అనుష్క ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.  ఈ సినిమాలో గోపీచంద్ కూడా నటిస్తున్నాడు.  గోపీచంద్ తో కలిసి అనుష్క  లక్ష్యం సినిమా చేసింది.  అప్పట్లో ఆ సినిమా మంచి హిట్.  ఆ తరువాత ఇప్పటి వరకు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు. ఇప్పుడు మరలా ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుండటం విశేషం.  ఈ సినిమా కోసం అనుష్క బరువు తగ్గేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.  ఈ సినిమా తరువాత గోపీచంద్ తమిళంలో హిట్ అయిన నాచియార్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు.  నాచియార్ జ్యోతిక పాత్రను తెలుగులో అనుష్క చేస్తుందట.