తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ గా అన్వేష్ రెడ్డి

తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ గా అన్వేష్ రెడ్డి

తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ గా అన్వేష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు చైర్మన్ గా ఉన్న కోదండ రెడ్డి ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ గా నియమింపబడ్డారు. అన్వేష్ రెడ్డి ఇంతకు ముందు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా పనిచేశారు.