చంద్రబాబు పై విష్ణువర్ధన్ రెడ్డి చిందులు

చంద్రబాబు పై విష్ణువర్ధన్ రెడ్డి చిందులు

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఎమర్జెన్సీ వాతావరణాన్ని కల్పిస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలన ను గాలికి వదిలి..దొంగలను చట్ట సభలకు పంపుతున్న చరిత్ర మీదని మండిపడ్డారు. బీజేపీ భిక్షతో ముఖ్యమంత్రి అయ్యిన చంద్రబాబు అది గుర్తుంచుకోవాలని అన్నారు. ఎన్నికల్లో ఏనాడు స్వతంత్రంగా గెలవని చంద్రబాబు.. మోడీ గురించి మాట్లాడమేంటని విష్ణువర్ధన్ రెడ్డి నిలదీసారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తే కనీస ఏర్పాట్లు లేవని...ఆయన రాష్ట్రంలో ఉన్నంత సేపు చంద్రబాబు పారిపోయారని ఎద్దేవా చేసారు. ఆ తర్వాత పూర్తిగా దిగజారి ప్రధానికి లేఖ రాసారని, దేశ ప్రధాని చనిపోయాడు అని ఫ్లెక్సీ వేసిన మీకంటే నీచులు ఇంకా ఎవరు లేరని విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.