30 నుంచి  ఏపీ బడ్జెట్ సమావేశాలు

 30 నుంచి  ఏపీ బడ్జెట్ సమావేశాలు

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జనవరి 30 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ వరకు 9 రోజులపాటు సభ సమావేశం కానుంది. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కోసం ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5న రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సర ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ రూ. 2లక్షల  కోట్ల రూపాయలు దాటనుంది. గతేడాది బడ్జెట్‌ రూ.1,93,000కోట్లు.