యువతకు చంద్రబాబు శుభాకాంక్షలు

యువతకు చంద్రబాబు శుభాకాంక్షలు

అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు సిఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.ఆకాశమే హద్దుగా అవకాశాలు ఉన్నాయని.. యువత అందిపుచ్చుకోవాలని కోరారు. ఏపీలో యువత అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, నాలెడ్జ్ ఎకానమికి రాష్ట్రం  కేంద్రంగా ఉండబోతోందని చంద్రబాబు చెప్పారు. కృష్ణా జిల్లా ప్రశాంతతకు మారు పేరని.. ఇలాంటి జిల్లాలో చిల్లర గొడవలు చేయడం ప్రతిపక్షాలకు సరికాదని హితవు పలికారు. గత జన్మభూమిలో 50 లక్షల అర్జీలు వస్తే.. ఇప్పుడు 5 లక్షలే వచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు.ప్రజల్లో సంతృప్తి పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.