ఆలోచనా విధానమే భవిష్యత్ కు మూలం

ఆలోచనా విధానమే భవిష్యత్ కు మూలం

అట్టడుగువర్గాల పిల్లలకు ఆత్మవిశ్వాసం కల్పించడంలో ఎన్టీఆర్ స్కూళ్లు విజయం సాధిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. అమరావతి ప్రజావేదికలో ఎన్టీఆర్ మోడల్ స్కూలు విద్యార్ధులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ఎన్టీఆర్ మోడల్ స్కూళ్లు ఉన్నాయని చంద్రబాబు కితాబిచ్చారు. మన భవిష్యత్ అదృష్టం మీద ఆధారపడదని, భవిష్యత్ మీద ఒక విజన్ ఉంటే.. మన ఆలోచనా విధానమే మారుతుందని చంద్రబాబు స్పష్టం చేసారు.