నిరంతరం శ్రమతోనే విజయం సిద్ధిస్తుంది...

నిరంతరం శ్రమతోనే విజయం సిద్ధిస్తుంది...

నిరంతరం శ్రమతోనే విజయాలు సాధ్యమన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ... కాస్త మనసుపెడితే అద్భుతాలు సాధించవచ్చన్నారు. దేశంలో ఉత్తమ ఫలితాలు సాధించిన టీమ్ మనదే అని వెల్లడించి చంద్రబాబు... మనలా ధనిక రాష్ట్రాలు కూడా కార్యక్రమాలు చేయలేకపోయాయన్నారు. నాలుగేళ్ల విజయాల్లో గ్రామస్థాయి అధికారి నుంచి సీఎంవో వరకు ప్రతీ ఒక్కరి పాత్ర ఉందని ప్రశంసించిన ఏపీ సీఎం... సంక్షోభంలోనూ జట్టుగా పనిచేసి అభివృద్ధి సాధించామన్నారు. 

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ఏరియల్ సర్వేలో పరిశీలించిన నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులు... ఇటువంటి నగరం ప్రపంచంలో మరెక్కడా రాదన్నారని తెలిపారు చంద్రబాబు. దేశంలో ఉత్తమ ఫలితాలు సాధించిన టీమ్ తమదే అని పేర్కొన్న ఆయన... సమర్ధవంతంగా పనిచేస్తే ఏదైనా సాధించగలమన్నారు. ఒక్కస్థాయికి వచ్చాం... దానిని నిలుపుకునేందుకు మరింత కష్టపడాలని సూచించిన చంద్రబాబు... 2029 కంటే ముందే దేశంలో ఏపీ నెంబర్‌వన్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాంకేతిక పరిజ్ఞానంపై ఆయన మాట్లాడుతూ... సాంకేతికతను వ్యక్తిగతంగా వాడడంలో నేను చాలా పూర్ అని... ఐటీని పాలనలో, విజన్‌లో ఉపయోగించగలిగామని తెలిపారు. లీడర్ అనేవారు ఐటీ పర్సన్ అవ్వాల్సిన పనిలేదని... టెక్నాలజీతో  ఏం చేయాలో, ఎలా చేయాలో తెలిస్తే చాలన్నారు చంద్రబాబు.