ఫాస్ట్‌ ట్రాక్‌లో రాజధాని పనులు...

ఫాస్ట్‌ ట్రాక్‌లో రాజధాని పనులు...

ఫాస్ట్ ట్రాక్‌లో నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు చేపడుతున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... అమరావతి స్టార్టప్ ఏరియాలో వెల్‌కం గ్యాలరీకి శంకుస్థాపన చేసిన ఆయన... అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ... రాజధానిని అద్భుతంగా తీర్చిదిద్దాలనే సంకల్పానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నామన్నారు. సింగపూర్ ప్రభుత్వం సహకరించి.. మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ముందుకొచ్చిందని గుర్తుచేసిన ఏపీ సీఎం... రాజధానికి ఓ రూపు రాబోతోందంటే కారణం రైతులే అన్నారు. రాజధాని నిర్మాణంలోనే కాకుండా స్కిల్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో కూడా సింగపూర్ సహకరిస్తోందన్నారు. ఇక డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చిందని తెలిపాన చంద్రబాబు... అవినీతి రహిత వ్యవస్ధ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.