'పేదరికంపై గెలుపు' లక్ష్యం ఇదే...

'పేదరికంపై గెలుపు' లక్ష్యం ఇదే...

పేద వాడికి నేరుగా అర్థిక సాయం చేయడమే పేదరికంపై గెలుపు కార్యక్రమం లక్ష్యం అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... తిరుపతిలో పేదరికంపై గెలుపు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు లక్షల మందికి ఆదరణ2 లో నేరుగా అర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ, అభివృద్ది కార్యక్రమల కలయికతో ప్రభుత్వం ముందుకు పోతున్నామన్న ఏపీ సీఎం... తెలుగు దేశం పేదల పార్టీ.. ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు బడుగులు, బలహీన వర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి అండగా ఉన్నామని స్పష్టం చేశారు. విభజన‌ తర్వాత సహాయ పడతారని తమకు సాయపడ్తారని మద్దతిచ్చాం.. సహాయపడాల్సిన వారు మొండిచేయి చూపారని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు... అయినా స్వశక్తితో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకు పోతున్నామన్నారు. 

రాష్టంలో రూ. 64 వేల కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించి ఇందులో రూ. 54 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు చేశామని తెలిపారు చంద్రబాబు...  దేశంలో అత్యధిక శాతం మరుగుదొడ్లు నిర్మించిన రాష్ట్రంగా నిలిచామని ప్రకటించిన ఆయన... రాష్ట్రంలో అన్ని చోట్లా ఎల్ఈడీ బల్బులు పెడుతున్నామన్నారు. తెదేపాకు బీసీలే వెన్నెముక... వారిని ఆదుకోవడం మా బాధ్యతన్న సీఎం... బ్యాంకులు ఇవ్వకపోయినా 90 శాతం రాయితీలతో ప్రభుత్వం రుణం ఇచ్చేలా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రతి పేద వాడికి కనీసం పది వేల రూపాయల ఆదాయం మా లక్ష్యమని స్పష్టం చేశారు చంద్రబాబు.