నేతలకు మరోసారి చంద్రబాబు ర్యాంకులు...

నేతలకు మరోసారి చంద్రబాబు ర్యాంకులు...

మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతల పనితీరును పరిశీలించి ర్యాంకులు ప్రకటిస్తూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... పార్టీలో, ప్రభుత్వ విధానాల‌లోనూ వారి ప‌నితీరు ఆధారంగా ర్యాంకులు కేటాయించడం కాదు... పనితీరు సరిగ్గా లేని నేతలను మెరుగుపర్చుకోవాలంటూ వార్నింగ్‌లు కూడా ఇస్తుంటారు. కాగా, ఈ రోజు జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలోనూ ఎమ్మెల్యే పనితీరుపై ర్యాంకులు ప్రకటించారు చంద్రబాబు... ఎమ్మెల్యేల పని తీరుపై తన సర్వే రిపోర్టును సమావేశంలో చదివి వినిపించారయాన. 70 శాతం సమీపంలో ఉన్న ఎమ్మెల్యేల పేర్లను చదివిన వినిపించారు చంద్రబాబు... తాజా చంద్రబాబు సర్వేలో 70 శాతం సంతృప్త స్థాయికి చేరిన మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లను పరిశీలించినట్లయితే... 

- మంత్రి అచ్చెన్నాయుడు (శ్రీకాకుళం)
- కోళ్ల లలితకుమారి (విజయనగరం)
- అయ్యన్నపాత్రుడు (విశాఖ)
- తోట త్రిమూర్తులు, జోగేశ్వరరావు (తూర్పుగోదావరి)
- చింతమనేని ప్రభాకర్, రామానాయుడు, రాధాకృష్ణ (పశ్చిమ గోదావరి)
- బోడె ప్రసాద్, గద్దె రామ్మోహన్ (కృష్ణా జిల్లా) సహా పలువురి పేర్లను సమావేశంలో చదివి వినిపించారు చంద్రబాబు నాయుడు.