కడప జిల్లా నేతలతో బాబు కీలక భేటీ

కడప జిల్లా నేతలతో బాబు కీలక భేటీ

టీడీపీ కీలక నేతలైన సీఎం రమేశ్, వరదరాజుల రెడ్డిల మధ్య ఏర్పడిన రచ్చ నేపథ్యంలో ఈరోజు కడప జిల్లా నేతలతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కడప జిల్లా నేతల మధ్య ఏర్పడిన విభేదాలు, ఈ మధ్య సీఎం రమేశ్ పై వరదరాజులు రెడ్డి విరుచుకు పడటం వంటి అంశాలతో వీరి భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం రమేశ్ జగన్ కు తొత్తులా వ్యవహరిస్తున్నారని.. ప్రతి విషయంలోనూ అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నాడని వరదరాజులు రెడ్డి సంచలనం రేపే ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమరావతిలో చంద్రబాబుతో భేటీ అయిన వారిలో కడప జిల్లా ఇంచార్జి మంత్రి సోమిరెడ్డి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు.