బెంగళూరు చేరుకున్న చంద్రబాబు...

బెంగళూరు చేరుకున్న చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెంగళూరు చేరుకున్నారు... ఆయన అక్కడ మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశం కానున్నారు... బెంగళూరులోని పద్మనాభనగర్‌లో ఉన్న దేవెగౌడ నివాసంలో ఈ భేటీ జరగనుంది. పద్మనాభనగర్‌ చేరుకున్న చంద్రబాబుకు దేవెగౌడ, కుమారస్వామి స్వాగతం పలికారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలతో వరుస భేటీలు కొనసాగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు... బీజేపీయేతర శక్తులను కూడగట్టే పనిలో ఉన్న సంగతి తెలిసిందే.