పిడుగుపాట్లపై దండోరా

పిడుగుపాట్లపై దండోరా

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగుపాట్ల మృతిచెందినవారిపై ఆరా తీశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ సీఎం... పిడుగుల సమాచారం ముందే వస్తున్నా ప్రాణనష్టం జరుగుతుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పిడుగుపాట్ల సమాచారాన్ని మరింతగా విశ్లేషించాలని అధికారులను ఆదేశించిన చంద్రబాబు... ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాలకు ముందే సమాచారం చేరేలా కమ్యూనికేషన్ మెరుగుపర్చాలని ఆదేశాలు జారీచేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.