నేడు నెల్లూరుకు సీఎం చంద్రబాబు..

నేడు నెల్లూరుకు సీఎం చంద్రబాబు..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు... జువ్వలదిన్నెలో ఉప్పుటేరు వాగు వంతెన ప్రారంభించనున్నారు. బోగోలులో జన్మభూమి- మా ఊరు ముగింపు సభలో పాల్గొననున్నారు సీఎం. రాష్ట్రంలో తొలిసారి 60 వేల మందికి 66 వేల ఎకరాల సీజేఎస్ఎఫ్ భూముల పట్టాలు పంపిణీ చేయనున్నారు. జిల్లా ప్రజల చిరకాల కోరిక దగదర్తి ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు ఏపీ సీఎం.. చంద్రబాబు పర్యటన కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది జిల్లా యంత్రాంగం. 1,884 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జిల్లాలో సీఎం పర్యటన కొనసాగనుంది. సీఎం పర్యటనలో పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.