'నీతి ఆయోగ్‌ సమావేశాన్ని వాయిదా వేయిండి'

'నీతి ఆయోగ్‌ సమావేశాన్ని వాయిదా వేయిండి'

నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని ఈనెల 18వ తేదీకి వాయిదా వేయాలని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాశారు. నీతి ఆయోగ్‌ 4వ సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు.. 16న రంజాన్, 17న ఉదయం ఈద్‌ మిలాప్‌ కార్యక్రమాలున్నాయని చెప్పారు. అందువల్ల 18వ తేదీకి లేదా 17వ తేదీ మధ్యహ్నానికైనా సమావేశాన్ని వాయిదా వేయాలని ఆ లేఖలో బాబు కోరారు.