ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల...

ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల...

ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు మంత్రి గంటా శ్రీనివాసరావు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్ని సెట్‌లను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో పరీక్షల నిర్వహణ ఆలస్యం కావడం వల్ల ఇతర రాష్ట్రాలకు మన విద్యార్థులు వెళ్లిపోయారన్న ఆయన... ఈ సారి మొత్తం ఏడు సెట్లను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నామని తెలిపారు. ఇక వివిధ సెట్లు... అవి నిర్వహించే తేదీలు... ఏ సెట్‌ను ఏ యూనివర్సిటీ నిర్వహించబోతోందన్న వివరాలు ఇలా ఉన్నాయి...
1. ఏపీ ఈ సెట్ - ఏప్రిల్ 19 (అనంతపురం జేఎన్టీయూ)
2. ఏపీ ఐసెట్ - ఏప్రిల్ 26 (ఎస్వీయూ)
3. ఏపీ పీజీ సెట్ - మే 1 నుంచి (ఆంధ్ర యూనివర్సిటీ)
4. ఏపీ ఎడ్ సెట్ - మే 6 (ఎస్వీయూ)
5. ఏపీ లా సెట్ - మే 6 (ఎస్కేయూ)
6. ఏపీ పీఈ సెట్ - మే 5 నుంచి (నాగార్జున యూనివర్సిటీ)
7. ఏపీ ఎంసెట్ ఏప్రిల్ 20 నుంచి (కాకినాడ జేఎన్టీయూ)