'జగన్‌ అవినీతి చక్రవర్తి..'

'జగన్‌ అవినీతి చక్రవర్తి..'

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అవినీతి చక్రవర్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి... కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రధాని నరేంద్ర మోడీని జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేస్తున్నా కేసుల మాఫీ కోసం మోడీ చేతిలో వైఎస్ జగన్ కీలుబొమ్మలా మారారని ఆరోపించిన కేఈ కృష్ణమూర్తి... కేసుల నుంచి బయట పడడానికి జగన్... నరేంద్ర మోడీకి అమ్ముడుపోయారని విమర్శించారు. వైఎస్ రాజేశఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కరెంటు బిల్లు కట్టలేని స్థితి నుంచి... సీఎం అయ్యాక 36 ఎకరాల్లో భవనం ఎలా నిర్మాంచారు అని ప్రశ్నించారు కేఈ కృష్ణమూర్తి.