తప్పక చర్యలు తీసుకుంటాం..

తప్పక చర్యలు తీసుకుంటాం..

తిరుపతిలో అమిత్ షాపై టీడీపీ శ్రేణులు చేసిన దాడిపై ఏపీ డీజీపీ మాలకొండయ్యకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈరోజు బీజేపీ ఎమ్మల్సీ సోము వీర్రాజు డీజీపీని కలిసి అమిత్ షా దాడిని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరారు. 'మా కార్యకర్తల మీద భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయని.... మా బీజేపీ కార్యకర్తలను రక్షించండి' అంటూ సోము వీర్రాజు వారిని కోరారు. ఎస్పీపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. 

ఈ సందర్భంగా డీజీపీ మాలకొండయ్య మాట్లాడుతూ... 'అమిత్ షా మీద  రాళ్ళ దాడి చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే.. రాళ్ళ దాడి జరగలేదు... కాన్వాయ్ లో ఏడో వాహనం స్లోగా ఉన్నపుడు కర్రతో దాడి చేశారు. దాడికి పాల్పడిన వారిపై కేసు పెట్టాం...ఇరు పార్టీల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసాం. మా సిబ్బంది తప్పుంటే చర్యలు తీసుకుంటాం' అని పేర్కొన్నారు.