'సోషల్‌ మీడియాలో ఆ పోస్టులు పెట్టొద్దు..'

'సోషల్‌ మీడియాలో ఆ పోస్టులు పెట్టొద్దు..'

సోషల్‌ మీడియాలో దుష్ప్రచారాన్ని నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సోషల్‌ మీడియాలో ఏ రాజకీయ పార్టీ గురించి అయినా లేదా ఏ నాయకుడి గురించి అయిన అసభ్యకరంగా పోస్టులు పెడితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవంటూ ఏపీ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఏ గ్రూప్‌లోనైనా ఇటువంటి పోస్టులు కనబడితే అడ్మిన్‌ను పూర్తి బాధ్యుడిని చేస్తామన్నారు. పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడతామన్నారు.