మోడీ జిమ్మిక్కులు పని చేయవు : యనమల

మోడీ జిమ్మిక్కులు పని చేయవు : యనమల

సంకీర్ణానికి గేట్లు తెరిచామని ప్రధాని మోడీ పేర్కొనడం హాస్యాస్పదని ఏపి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ..పాతమిత్రులతో దోస్తీకి సిద్ధం అనడం మోడీ దివాలాకోరుతనమని, బిజెపి దుస్థితికి మోడీ వ్యాఖ్యలు అద్దం పట్టాయని వ్యాఖ్యానించారు.భాగస్వామ్య పక్షాల విశ్వసనీయతను మోడీ ఎప్పుడో కోల్పోయారని యనమల అన్నారు.గేట్లు తెరుచుకుని భాగస్వామ్య పార్టీలే వెళ్లిపోయాయని.. ఇప్పుడు మళ్లీ మోడీ గేట్లు తెరవడం హాస్యాస్పదమని కామెంట్ చేశారాయన. మరో రెండు నెలల్లో ఎన్నికల ఉన్నందునే ప్రధాని మోడీ జిమ్మిక్కులని,ఎన్ని జిత్తులు వేసినా ప్రజలు మోడీని నమ్మరని యనమల తేల్చి చెప్పారు. ఈబిసిలకు 10శాతం రిజర్వేషన్లు మోడీ తాజా జిమ్మిక్కు అని చెప్పిన ఆయన, 22ఏళ్లుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్లపై ఎందుకు స్పందించరని నిలదీశారు.శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులపై కేంద్రం చర్యలేవని ప్రశ్నించిన ఆర్ధికమంత్రి యనమల,తెలంగాణ ముస్లింల రిజర్వేషన్లు, ఏపిలో కాపుల రిజర్వేషన్లపై ఎందుకు స్పందించరని నిలదీశారు.ఏపి అభివృద్ధి చెందకూడదని కోరుకునే ఏకైక వ్యక్తి జగన్ అని, ఆయన జననేత కాదని.. ధన నేతని విమర్శించారు.