ఏపీ ఐసెట్- 2018 ఫలితాలు విడుదల

ఏపీ ఐసెట్- 2018 ఫలితాలు విడుదల

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన ఐసెట్‌-2018 పరీక్ష ఫలితాలు శనివారం విడుదల చేశారు. విజయవాడలోని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కొద్దిసేపటి క్రితం ఈ ఫలితాలను విడుదల చేశారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఈ పరీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐసెట్‌లో 92.60శాతం ఉత్తీర్ణత నమోదైందని వెల్లడించారు.  అలాగే.. జూన్‌ 20వ తేదీ నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వివరించారు. 

ఐసెట్ లో టాప్‌ ర్యాంకర్స్ విషయానికి వస్తే...మొదటి ర్యాంక్‌ ను గుంటూరుకు చెందిన చింతగుంట్ల ప్రసన్న పవన్‌కుమార్‌ కి రాగా.. రెండో ర్యాంక్‌ ను అనంతపురానికి చెందిన వెంకట నరసుగారి భరత్‌కుమార్‌ కి దక్కింది. వరుసగా మూడో ర్యాంక్‌- నుసుమ్‌ సాయికుమార్‌రెడ్డి(అనంతపురం), నాలుగో ర్యాంక్‌- హర్షవర్ధన్‌ పౌలి(అనంతపురం), ఐదో ర్యాంక్‌- సొల్లేటి శ్రీహర్షవర్ధన్‌(కృష్ణా), ఆరో ర్యాంక్‌- బొర్రా శ్రీదీప్తి(శ్రీకాకుళం), ఏడో ర్యాంక్‌- కాకాని వాసు కృష్ణకుమార్‌(విశాఖపట్నం), ఎనిమిదో ర్యాంక్‌- కూన వెంకటలక్ష్మీ నారాయణరావు(విశాఖపట్నం), తొమ్మిదో ర్యాంక్‌- డబ్బీరు వెంటసాయి మనోజ్‌బాబు(శ్రీకాకుళం), పదో ర్యాంక్‌- ఒ.భానుప్రకాశ్‌(చిత్తూరు) పొందారు.