కోడికత్తిపై వర్మ సస్పెన్స్ థ్రిల్లర్ తీయొచ్చు...

కోడికత్తిపై వర్మ సస్పెన్స్ థ్రిల్లర్ తీయొచ్చు...

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన కోడికత్తి దాడిని ఎవరైన ఖండించాల్సిందే... కానీ, ఘటన జరిగిన తీరుపై దర్శకుడు రాంగోపాల్ వర్మ అయితే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తీయవచ్చు అంటూ ఘటనపై సెటైర్లు వేశారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు... విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై నమ్మకం లేదంటున్న వైఎస్ జగన్‌.... హైదరాబాద్‌ నుంచి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక పవన్, జగన్ రాష్ట్రం పట్ల బాధ్యత లేని మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన గంటా... ఎన్నికల్లో ప్రజలు వాళ్లకు ఎందుకు ఓటు వేయాలని సూటిగా ప్రశ్నించారు.