రియల్ టైం గవర్నెన్స్ తో మెరుగైన సేవలు

రియల్ టైం గవర్నెన్స్ తో మెరుగైన సేవలు

రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. భారత్ లో 4వ పారిశ్రామిక విప్లవం, చోటు చేసుకుంటున్న మార్పులు, వస్తున్న అవకాశాలపై జరిగిన సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ఒప్పందం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ఒప్పందంతో 4వ పారిశ్రామిక విప్లవం, అధునాతన టెక్నాలజీ వినియోగంలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ముందు ఉండే అవకాశం వస్తుందని తెలిపారు.  ఏపీ నాలుగున్నరేళ్ల వయస్సు ఉన్న స్టార్టప్ రాష్ట్రమని తెలిపారు.  సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుంటూ అభివృద్ధి సాధిస్తున్నామని లోకేష్ తెలిపారు. 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఒక్కటి గానూ, 2029 దేశంలో నెంబర్ వన్ స్థానంలోనూ అని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. నూతన రాజధాని అమరావతిలో భూ రికార్డులన్నీ డిజిటలైజ్ చేస్తున్నామని తెలిపారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగం ద్వారా ల్యాండ్ రికార్డ్స్ టాంపరింగ్ జరగకుండా రక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. డ్రోన్స్ పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామని తెలిపారు. డ్రోన్లకు లైడార్ టెక్నాలజీ అనుసంధానం చెయ్యడం ద్వారా రహదారుల నాణ్యత తెలుసుకునే పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతంగా నిర్వహించామని లోకేష్ చెప్పారు.