జగన్ పాదయాత్రపై మంత్రి నక్కా సెటైర్లు

జగన్ పాదయాత్రపై మంత్రి నక్కా సెటైర్లు

వైసిపి అధినేత జగన్ పాదయాత్రపై మంత్రి నక్కా ఆనందబాబు సెటైర్లు వేశారు. వారంలో రెండు రోజులు విరామం తీసుకునేది పాదయాత్ర అంటారా అని నిలదీశారు. పాదయాత్రలో ఎక్కడైనా ప్రజల  సమస్యలను పరిష్కరించడానికి జగన్ కృషి చేశారా ప్రశ్నించిన మంత్రి నక్కా, అధికారంలోకి వస్తే రైతులకు ఎలా న్యాయం  చేస్తారన్నారు.రైతులను అన్ని విధాలుగా ఆదుకుని, గిట్టుబాటు ధర కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిది అని ఆనందబాబు అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిత్లీ తుపాన్ బాధితులను ఆదుకుంటానని జగన్ హామీలు గుప్పిస్తున్నారని, ప్రభుత్వం ఇప్పటికే బాధితులను అన్ని విధాలుగా ఆదుకొని నష్టపరిహారం ఇవ్వడం జరిగిందని చెప్పారు.రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి జగన్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేయించడమే కాదు.. పోలవరం నిర్మాణాన్ని అడ్డుకోవడానికి సైతం  ప్రయత్నించారని మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు.