చంద్రబాబుతో పోటీ అంత ఈజీ కాదు : లోకేష్

చంద్రబాబుతో పోటీ అంత ఈజీ కాదు : లోకేష్

జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో భాగంగా మంత్రి నారా లోకేష్  ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.నియోజకవర్గంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రూ. 5కోట్ల వ్యయంతో 16 గ్రామాలకు తాగునీరు అందించేందుకు కట్టమూరు గ్రామంలో నిర్మించిన మల్టీ విలేజ్ తాగునీటి పథకాన్ని, రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మించిన పెద్దాపురం ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించారాయన. అభివృద్ధి విషయంలో సిఎం చంద్రబాబు  స్పీడ్ తో మనమెవ్వరం పోటీ పడలేక పోతున్నామని లోకేష్ అన్నారు. 20 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్యానిదని మంత్రి లోకేష్ చెప్పారు. 200 రూపాయల పింఛన్ 2 వేల రూపాయలు చేసామని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కష్ట పడుతుంటే....ప్రోత్సహించాల్సింది పోయి మోడీ  ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఇక కేసులు మాఫీ కోసమే జగన్ మోఢీ జపం చేస్తున్నారని మండిపడ్డారు.  

2019 గెలుపు చంద్రబాబుదేనని ధీమా వ్యక్తం చేశారు.కులం,మతం అడ్డం పెట్ఠుకుని రాజకీయాలు చేస్తున్న మోడీ ఆటలు సాగవని, ప్రధాన మంత్రిని చంద్రబాబు నిర్ణయిస్తారని మంత్రి లోకేష్ తేల్చి చెప్పారు.మొన్న కర్ణాటకలో చూపించింది కేవలం ట్రైలర్ మాత్రమేనని,అసలు సినిమా ఏపీలో ముందుందన్నారాయన. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబే ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు సైతం కోరుకుంటున్నారని లోకేష్ చెప్పుకొచ్చారు.