ఏపీపై కేంద్రం పగబట్టింది 

ఏపీపై కేంద్రం పగబట్టింది 

కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రం మరోసారి మోసం చేసిందని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ఏపీపై పగబట్టడమే అని విమర్శించారు. ఏపీ పట్ల కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెకాన్ సంస్థ ఫీజుబుల్ రిపోర్టులో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని నివేదికలు ఇచ్చిందని తెలిపారు. చంద్రబాబు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు  రాష్ట్ర వాటాగా రూ. 200 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారని గుర్తుచేశారు. మౌలిక వసతుల కల్పనకు ముందుకొచ్చారని స్పష్టం చేశారు. గతంలో వెంకయ్యనాయుడు ఛాంబర్‌లో ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారులతో జరిగిన భేటీని ఆయన గుర్తు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అడిగినవన్నీ ఇచ్చేందుకు ఒప్పుకున్నామని అన్నారు. ప్రజలంతా ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో సాధ్యం కాదని చెప్పడం దురదృష్టకరమని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.