రాక్షస మూకలన్నీ ఎకమౌతున్నాయ్..

రాక్షస మూకలన్నీ ఎకమౌతున్నాయ్..

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని మించిన బ్రహ్మ రాక్షసుడు ప్రపంచంలోనే లేడని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డాడు. ఈరోజు యనమల మాట్లాడుతూ... చంద్రబాబును రాక్షసుడు అనడమే జగన్ రాక్షసత్వానికి పరాకాష్ట అని.. జగన్మోహన్ రెడ్డిని మించిన బ్రహ్మ రాక్షసుడు ప్రపంచంలోనే మరొకరు లేరని ఆయన వెల్లడించారు.

వైఎస్ కుటుంబం రాక్షస కుటుంబ కాబట్టే మీ తాత అన్నం పెట్టిన యజమానిని హత్యచేశాడని వివరించారు. అసలు మీ నాయన మంచివాడైతే ఆయన మీద సెక్రటేరియట్ లో కాల్పులు ఎందుకు జరిగాయి..? అంటూ ప్రశ్నించారు. మీరు రాక్షసత్వంతోనే కదా 200మంది టిడిపి కార్యకర్తలను హత్యచేసిందని పేర్కొన్నారు. అదే రాక్షసత్వంతోనే  కదా పరిటాల రవీంద్రను పట్టపగలు నడిరోడ్డుపై కాల్చిచంపింది..?, నీ లాంటి రాక్షసుడికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అడ్డంగా భక్షిస్తావని యనమల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'కేవలం 5ఏళ్లలో రూ.లక్ష కోట్లు భక్షించిన నీకంటే రాక్షసుడు ఎవరు..? అధికారం ఇస్తే బిజెపికి రాష్ట్రాన్ని తాకట్టు పెడతావు, నీ కేసులు మాఫీ చేయించుకుంటావు.. బిజెపితో కుమ్మక్కై రాష్ట్రానికి నమ్మకద్రోహం చేస్తున్నావు కర్ణాటకలో ఖనిజ దొంగ 'గాలి' గ్యాంగ్ కు మీ పార్టీ ప్రచారం చేయలేదా..?' అంటూ యనమల ప్రశ్నాస్త్రాలు సంధించారు. రాక్షస మూకలన్నీ, మాఫియాను తలపించేలా  ఏకం అవుతున్నారు. ఇలాంటి వారితో తెలుగుజాతికే ప్రమాదం ఉంది.. ఈ విషయంలో అన్నివర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యనమల సూచించారు.