తెలంగాణ హైకోర్టు లో ఏపి పోలీసు అంశంపై విచారణ

తెలంగాణ హైకోర్టు లో ఏపి పోలీసు అంశంపై విచారణ

ఇవాళ తెలంగాణ హైకోర్టు లో ఆంధ్రప్రదేశ్ పోలీసు అంశంపై కేసు విచారణకు రానుంది.  ఏపి అంశం కావడంతో దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ జరుపుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.ఏపి డిఎస్పీల సీనియారిటీ లిస్ట్ తయారు చేసే సమయంలో  తెలంగాణా పోలీసుల అనుమతి తీసుకోవాలన్న దానిపై స్పష్టత రావడం లేదంటూ ఉమ్మడి హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. అయితే దీనిపై ఏపి, తెలంగాణ హోంశాఖ గవర్నమెంట్ ప్లీడర్లు ఏం చెబుతారు? న్యాయస్థానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.. ఏపి హైకోర్టు పరిధిలోని అంశం అయినందున అక్కడే తేల్చుకోవాలని న్యాయస్థానం పేర్కొనే అవకాశం ఉందని న్యాయవాదులు భావిస్తున్నారు.