రూ. 2,344 కోట్ల ఏపీ దళిత యాక్షన్ ప్లాన్ ఇదే... 

రూ. 2,344 కోట్ల ఏపీ దళిత యాక్షన్ ప్లాన్ ఇదే... 

అట్టడుగు  వర్గాలను అభివృద్ధి పరిచేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తోందని ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకరరావు వెల్లడించారు.
 ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ  తమ ప్రభుత్వం ఒక్కోటి రూ.20 లక్షల విలువ చేసే  500 ఇన్నోవా కార్లను దళిత యాక్షన్ ప్లాన్ కింద అందించబోతున్నట్లు తెలిపారు.  500 ట్రాక్టర్లను తమ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందిచనుందని,  7,500 ఇ-బ్యాటరీ వెహికల్స్ ను కూడా  దళితుకు అందిస్తామన్నారు. ల్యాండ్ పర్చేజింగ్  స్కీమ్ ద్వారా రూ. 135 కోట్లు కేటాయించి దళితులకు భూములను ప్రభుత్వమే అందించనుందన్నారు.   16 వేల మంది దళిత నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి...   సాఫ్ట్‌వేర్ ఉద్యగిగా తీర్చిదిద్దేందుకు రూ. 163.17 కోట్లను  కేటాయించినట్లు ఆయన తెలిపారు.  తమ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ కింద  1,25,400 మంది దళితుల కోసం  రూ. 2,344 కోట్లతో  ఖర్చు చేస్తామన్నారు.  పారిశ్రామిక వేత్తగా  ఎదిగేందుకు రూ.45 లక్షల ఇచ్చేందుకు కార్పొరేషన్ సిద్దంగా ఉందని,  బ్యాంకర్లు సహకరించకపోతే ఆ బ్యాంకులను బ్లాక్ లిస్ట్ లో ఉంచుతామని జూపూడి అన్నారు.  దళితులలో విజయ మాల్యాలు, నీరవ్ మోడీలు లేరన్నారు. అదే సమయంలో  దళిత ఉద్యోగులు కూడా తమ సోదరులకు ష్యూరిటీలు ఇవ్వాలని జూపూడి కోరారు. తమ కార్పొరేషన్ వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు.