ప్రకృతి సేద్యంతో రికార్డు సృష్టిస్తున్నాం

ప్రకృతి సేద్యంతో రికార్డు సృష్టిస్తున్నాం

పురుగుమందులు వాడకం తో విషపూరిత ఆహారం తీసుకుంటున్నామని,ప్రకృతి సేద్యంలో రికార్డ్  సృష్టించబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉండవెల్లి ప్రజా వేదికలో ఇ- రైతు మాస్టర్ కార్డ్ ఫార్మర్  నెట్‌ వర్క్‌ ప్రోగ్రాంను ఆయన ఇవాళ ప్రారంభించారు.  మాస్టర్ కార్డ్ నెట్ వర్క్  వేదిక ద్వారా తమ పంటలను ప్రపంచం వ్యాప్తంగా రైతులు అమ్ముకునే అవకాశముందని సీఎం చెప్పారు.
ఇ నెట్‌ వర్క్ మంచి ఫలితాలు ఇవ్వనుందని,టెక్నాలజీ ని సరిగ్గా ఉపయోగించుకుంటే వ్యవసాయం మరింత లాభసాటిగా మారుతుందన్నారు.  రైతులు తమ ఉత్పత్తులను  చక్కగా మార్కెట్‌ చేసుకునేందుకు  మాస్టర్ కార్డ్ నెట్ వర్క్ చాలా మంచి వేదిక అని అన్నారు.టెక్నాలజీ పట్ల తాను అమిత ఫ్యాషన్ ఉన్న వ్యక్తినని,  బిసినెస్ కోసం కాకుండా.. రైతులకు ఉపయోగ పడాలనే మాస్టర్ కార్డ్ ప్రయత్నం  చేస్తున్నామని చంద్రబాబు అన్నారు.
19న జ్ఞానభేరీ
ఈ నెల 19వ తేదీన మచిలీపట్నంలో జ్ఞానభేరి జరగనుంది. దీనికి  ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు. కృష్ణా విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో జరిగే జ్ఞానభేరిలో విద్యార్థులతో సీఎం ముఖాముఖి
  మాట్లాడుతారు.  కొత్తగా నిర్మించిన కృష్ణా విశ్వవిద్యాలయం భవనాన్ని సీఎం ప్రారంభిస్తారు.