ఎన్నికలకు ఏపీసీసీ కొత్త టీమ్

ఎన్నికలకు ఏపీసీసీ కొత్త టీమ్

రాష్ట్రంలో ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ గా మాజీ కేంద్రమంత్రి పళ్ళంరాజు, మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా బాపిరాజును నియమించినట్లు ఏపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ  21 మందితో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేశామన్నారాయన.రాహుల్ గాంధీ ఆలోచన మేరకే నియామకాలు జరిగాయని చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 3 వరకు ప్రజా భరోసా యాత్ర జరుగుతుందని ఏపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు.భరోసా యాత్రలో రాహల్, ప్రియాంక పాల్గొంటారని అన్నారు. మొత్తం  64 చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో 25 పార్లమెంటు స్థానాలకు 182 అప్లికేషన్ వచ్చాయని,  175 నియోజకవర్గాలకు 1090 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని రఘువీరా వివరించారు. హోదా గురించి గుంటూరు సభలో మోడి చేసిన ప్రసంగం నీటి కుళాయి వద్ద పోట్లాటను మరిపించిందని ఎద్దేవా చేసారు.