ఢిల్లీ హోదాపై ఆప్ కీలక నిర్ణయం

ఢిల్లీ హోదాపై ఆప్ కీలక నిర్ణయం

ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. ఆప్ కూడా దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది.  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమావేశం నిర్వహించారు. ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్ ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని ఢిల్లీ అసెంబ్లీ ఆమోదించింది. బీజేపీ 2019 ఎన్నికల లోపు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. రాష్ట్రహోదా ఇస్తే... ఢిల్లీ ఓటర్లంతా కమలం పార్టీని విశ్వసిస్తారని తెలిపారు. రాష్ట్ర హోదా ఇవ్వకపోతే మాత్రం ఆ పార్టీ ఢిల్లీ వదలి వెళ్లాలని ప్లకార్డులతో రోడ్లపైకి వస్తారని కేజ్రీవాల్  హెచ్చరించారు.