మురుగదాస్ డైరెక్టర్ నుంచి యాక్టరయ్యాడు..!!

మురుగదాస్ డైరెక్టర్ నుంచి యాక్టరయ్యాడు..!!

ఏఆర్ మురుగదాస్.. సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు.  ఆయన తీసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ భారీ స్థాయిలో ఉంటాయి.  ప్రస్తుతం విజయ్ తో సర్కార్ చేస్తున్నాడు. తుపాకీ, కత్తి తరువాత విజయ్ తో చేస్తున్న మూడో సినిమా ఇది.  మురుగదాస్ వద్ద  శిష్యరికం చేసిన చాలా మంది ఇప్పుడు దర్శకులుగా మారారు.  వారిలో ఒకరు ఆనంద్ శంకర్. మురుగదాస్ తుపాకీ, సెవెంత్ సెన్స్ సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేశారు.  2014 లో వచ్చిన అరిమ నంబి సినిమాతో దర్శకుడిగా మారారు.  2016 లో విక్రమ్ తో ఇరుముగన్ చేశారు.  ఇప్పుడు విజయ్ దేవరకొండతో నోటా సినిమా చేస్తున్నాడు.  

ఇదిలా ఉంటె, ఈ దర్శకుడు తన గురువైన మురుగదాస్ కు తన నోటా స్క్రిప్ట్ గురించి చెప్తుండగా.. మురుగదాస్ ఒక నటుడిలా సోఫాలో కూర్చొని శ్రద్దగా వింటున్నాడు. ఈ సమయంలో ఒకరు ఆ దృశ్యాన్ని ఫోటోగా చిత్రీకరించారు.  ఈ ఫోటోను దర్శకుడు ఆనంద్ శంకర్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. దర్శకుడు మురుగదాస్ నటుడుగా మారిన వేళ అనే అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారు.  ఈ ట్వీట్ ను మురుగదాస్ లైక్ చేస్తూ ఎమోజిని పెట్టారు.  ఈ ట్వీట్ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ గా మారింది. 

విజయ్ దేవరకొండ గీత గోవిందం విజయంతో.. నోటా కు క్రేజ్ పెరిగింది.  తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ చేశారు.  ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.