అర్జున్‌రెడ్డి బ్ర‌ద‌ర్‌ని చూశారా?

అర్జున్‌రెడ్డి బ్ర‌ద‌ర్‌ని చూశారా?

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా ఎదిగాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అంత‌కుముందు `ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం` చిత్రంలో చ‌క్క‌ని పాత్ర‌లో న‌టించి మెప్పించాడు. అటుపై అత‌డు ఎంచుకున్న  స్క్రిప్టు స్కైలోకి తీసుకెళ్లింది. రెబ‌ల్ యాటిట్యూడ్.. యారోగెంట్‌ ఆల్క‌హాలిక్ మెడికో పాత్ర‌లో దుమ్ము దులిపేశాడు. న‌ట‌న అంటే ఇలా ఉండాలి.. అని దేవ‌ర‌కొండ‌ను తెలుగు యూత్ పిచ్చిగా వోన్ చేసుకున్నారు. ఆ క్ర‌మంలోనే అర్జున్‌రెడ్డి హ‌వా తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో డ‌బుల్ అయ్యింది. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థ‌లు అత‌డికి అడ్వాన్సులు ఇచ్చి లాక్ చేశాయి. అత‌డితో సినిమాలు నిర్మిస్తున్నాయి. 

అదంతా స‌రే.. అర్జున్‌రెడ్డి అలియాస్ దేవ‌ర‌కొండ‌కు ఓ బ్ర‌ద‌ర్ కూడా ఉన్నాడు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న‌ది ఆ కుర్రాడే. చూసేందుకు అన్న‌ను మించిన రెబ‌ల్‌లా క‌నిపిస్తున్నాడు. అర్జున్‌రెడ్డి పార్ట్ 2 తీస్తే ఈ కుర్రాడితోనే తీయాలేమో! అన్నంత యాటిట్యూడ్ ఆ ఫేస్‌లో క‌నిపిస్తోంది. ఇప్ప‌టినుంచే అత‌గాడికి ఏవైనా దేవ‌రకొండ న‌ట‌శిక్ష‌ణతో రాటుదేల్చే ఆలోచ‌న‌లో ఉన్నాడా? అత‌డినే అడ‌గాలి.