'అర్జున్ రెడ్డి' ఆగిపోయిందట !

'అర్జున్ రెడ్డి' ఆగిపోయిందట !

 

తెలుగులో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన 'అర్జున్ రెడ్డి'ని తమిళంలో స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ రీమేక్ ను బాల డైరెక్ట్ చేస్తున్నాడు.  షూటింగ్ మొత్తం దాదాపు పూర్తైంది.  కానీ అవుట్ ఫుట్ చూసుకున్న మేకర్స్ సంతృప్తి చెందలేదట.  మళ్ళీ సినిమాను రీషూట్ చేయాలని డిసైడ్ అయ్యారట.  అంతేకాదు బాల స్థానంలో వేరే దర్శకుడ్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారట.  గతంలో పలు సూపర్ హిట్ చిత్రాలను అందించిన బాల స్థానంలో వేరొకర్ని తీసుకుంటుండటంతో ఈ వ్యవహారం తమిళ పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది.