ఎల్ఎల్ఎం పరీక్షకు హజరైన ఎమ్మెల్యే

ఎల్ఎల్ఎం పరీక్షకు హజరైన ఎమ్మెల్యే

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చదువుపై మక్కువతో ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారు. ఆయన ప్రస్తుతం హన్మకొండలోని ఆదర్శ లా కాలేజీలో దూరవిద్యా విధానంలో ఎల్ఎల్ఎం కోర్సు అభ్యసిస్తున్నారు. వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న మూడో సెమిస్టర్ పరీక్షకు ఆయన హాజరయ్యారు. రెండు సంవత్సరాల ఎల్ఎల్ఎం కోర్సులో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గత ఏడాది రెండు సెమిస్టర్లలో ఉత్తీర్ణత సాధించారు.