జవాన్ మృతి, ఇద్దరు ఉగ్రవాదుల హతం...

జవాన్ మృతి, ఇద్దరు ఉగ్రవాదుల హతం...

జమ్మూకాశ్మీర్‌లోని బందిపోరా జిల్లా హాజిన్ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా... ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. ఉత్తర కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలోని పనార్ అటవీ ప్రాంతంలోని హాజిన్‌లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్గారు... అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురకాల్పులు జరపగా... ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. మరోవైపు పనార్ ఫారెస్ట్‌లో మరికొంతమంది ఉగ్రవాదులున్నారనే సమాచారంతో ఇండియన్ ఆర్మీ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.